Thursday, May 10, 2012

సోయాబీన్స్ కర్రీ


కావలసిన పదార్థాలు


  • సోయాబీన్స్. 1/4 కేజీ
  • రీఫైండ్ ఆయిల్. వేయించేందుకు సరిపడా
  • కరివేపాకు. 1/2 కట్ట
  • కారం. 1/2 టీస్పూ//.
  • ఉప్పు. సరిపడా
  • జీలకర్ర పొడి. 1 టీస్పూ//.

తయారీ విధానం


సోయాబీన్స్‌ను కడిగి ఆరుగంటలసేపు నానబెట్టి నీరు వడగట్టి బాగా ఆరనివ్వాలి.
తరవాత బాణెలిలో నూనె పోసి కాచి గింజల్ని కరకరలాడేలా వేయించాలి.
వేడిగా ఉండగానే ఉప్పు, కారం, జీలకర్ర పొడి చల్లాలి. కొద్దిగా నలిపిన కరివేపాకును వేసి ఓసారి అట్లకాడతో గింజల్ని కలియతిప్పి ఆరాక డబ్బాలో పోసి పెట్టాలి.
చాలారోజులపాటు నిల్వ ఉండే సోయాబీన్స్ దాల్‌ ఫ్రై రెఢీ.

No comments:

Post a Comment