Friday, May 18, 2012

బ్రెస్ట్ క్యాన్సర్‌కి చెక్‌ పెట్టే కూరగాయలు

నేటి మహిళలను ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. జీవనశైలిలో మార్పులు ఇతరత్రా పలు కారణాల వల్ల పట్టణ మహిళల్లో ఇది ఎక్కువగా కన్పిస్తోంది. దగ్గరి సంబంధీకుల్లో ఎవరైనా ఈ మహమ్మారినుంచీ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే మొదటినుంచీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

* బీటా కెరొటిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మామూలు క్యారట్ల కన్నా బేబీ క్యారట్లలో ఉండే బీటా కెరొటిన్‌ను శరీరం తేలిగ్గా గ్రహించగలుగుతుంది. ఆ తేడా ఏకంగా 500 శాతం ఎక్కువ. కాబట్టి లేలేత క్యారట్లను ఆహారంలో తప్పనిసరి అంశం చేసుకోవడం మంచిది.

* నిండు ఎరుపుతో నోరూరించే చెర్రి పండ్లు తినండి. వాటిల్లో ఉండే ఒక పదార్థం క్యాన్సర్‌ని నిరోధిస్తుందని మంచి పేరు.

* వెల్లుల్లి సైతం క్యాన్సర్ కణాల్ని చంపేస్తుంది. అయితే దాన్ని వండుతున్నట్లైతే మాత్రం పొట్టు తీసి, తరిగి ఒక పదినిమిషాలు ఉంచండి. తర్వాతే వంటలో వేయండి. పొట్టు తీయగానే వేడి చేస్తే అందులో క్యాన్సర్‌తో పోరాడే పదార్థాలు తయారయ్యే అవకాశం తగ్గుతుంది.

* విటమిన్ డి తగుపాళ్లలో తీసుకునే వన్నిటల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తక్కువ. కాబట్టి వైద్య సలహాతో తగినంత విటమిన్ డి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

* టమాటాలు వాడండి. కూరల్లో, సూపుల్లో, రసం తీసి... ఏదో ఒక రూపంలో టమాటా తీసుకుంటే అందులో ఉండే లైకోపిన్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

* రిఫైన్‌డ్ ధాన్యం కన్నా తక్కువ పాలిష్ పట్టిన ధాన్యం వాడాలి. పూర్తిగా రిఫైన్‌డ్ ధాన్యం వాడిన మహిళల్లో బ్రెస్ట క్యాన్సర్ ఎక్కువగా వచ్చినట్లు అధ్యయనాలు చెప్తున్నాయి.

* చల్లగా అయినా, వేడిగా అయినా గ్రీన్ టీ తాగండి.

* వారానికి రెండుసార్లు పాలకూర తిన్నవాళ్లలో... బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం సగానికి సగం తగ్గినట్లు పరిశోధనలో తేలింది.

No comments:

Post a Comment