Wednesday, May 9, 2012

పొన్నగంటి ఆకు కూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • కంది పప్పు : 1/2 కప్పు
  • పొన్నగంటి ఆకు:2 కట్టలు
  • ఉప్పు: తగినంత
  • పసుపు చిటికెడు
  • పోపు: ఆవాలు, జీల కర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు.

తయారీ విధానం

ముందుగా పొన్నగంటి ఆకు ఒలుచుకుని శుభ్రం చేసుకోవాలి.
బాణెలి లో కందిపప్పు వేసి నీరు పోసి ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిపోకుండా చూసుకోవాలి.
సరిపడా ఉడికాక జల్లి పళ్ళెంలో వేసి వడపోసుకోవాలి.
మరల బాణెలి లో కొంచెం నూనె వేసి పోపు వేయించుకుని పొన్నగంటి ఆకు వేసి వేయించి తగినంత ఉప్పు, పసుపు వేసి కొద్దిగ నీరు చల్లి దగ్గరగా మూత పెట్టి ఆకుని వార్చుకోవాలి.
ఆకు వాడిన తర్వాత నీరు పూర్తిగ ఇంకిపోయక, ఉడికించుకున్న కందిపప్పు వేసి కలుపుకోవాలి.
అంతే కూర తయారు. దినికి ఇంగువ వేసి, మజ్జిగ మిరపకాయలు వేసి నూనె కాచుకుంటే అన్నంలోకి బాగుంటుంది.

No comments:

Post a Comment