Thursday, May 10, 2012

నువ్వులతో బీరకాయ కూర


కావలసిన పదార్థాలు


  • బీరకాయలు. 500 గ్రా
  • ఉల్లిపాయ. 1
  • పచ్చిమిర్చి. 2
  • నువ్వులు. 1.1/2 టీస్పూ//.
  • పసుపు. 1/4 టీస్పూ//.
  • ఉప్పు. రుచికి తగినంత
  • నూనె. 1/2 టీస్పూ//.
  • పోపు కోసం
  • ఆవాలు జీలకర్ర. 1 టీస్పూ//.
  • మినప్పప్పు. 3/4 టీస్పూ//.
  • శనగపప్పు. 1 టీస్పూ//.
  • ఎండుమిర్చి. 2
  • కరివేపాకు. 2 రెమ్మలు

తయారు చేయు విధానము :


బీరకాయ ముక్కల్లో మూడు, 4 టీస్పూన్ల నీళ్లు కలిపి అందులో ఉప్పు, పసుపువేసి సన్నటి మంటపైన నీళ్లు ఇంకిపోయేదాకా ఉడికించాలి.
బాణెలి లో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి.
అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి ఐదు నిమిషాలు వేయించాలి.
తరువాత ఉడికించి ఉంచుకున్న బీరకాయ ముక్కలను పోపులో కలిపివేయాలి.
అలాగే మూడు నిమిషాలు ఉడికించాక, నువ్వుల పొడి చల్లి దించేయాలి. అంతే బీరకాయ నువ్వుల కూర రెడీ.

1 comment:

  1. The King Casino - Ventureberg
    The septcasino.com King Casino https://vannienailor4166blog.blogspot.com/ is ventureberg.com/ owned by British casino operator Crown Resorts and operated by Crown Resorts. It is febcasino owned by British ADDRESS: CASTLE goyangfc.com

    ReplyDelete