Thursday, May 10, 2012

చిక్కుడు మసాలా కూర


కావలసిన పదార్థాలు :


  • చిక్కుడుకాయలు. 1/4 కేజీ
  • బంగాళాదుంపలు. 100 గ్రా.
  • పండు టొమోటోలు. 3
  • ఉల్లిపాయలు. 3
  • వెల్లుల్లి రెబ్బలు. 10
  • అల్లం. కాస్తంత
  • ధనియాలు. 1 టీస్పూ//.
  • దాల్చిన చెక్క. 3
  • లవంగాలు. 5
  • కారం. 1 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • పసుపు. 1/2 టీస్పూ//.
  • నూనె. 1/2 కప్పు
  • కొత్తిమీర. 1 కట్ట

తయారు చేయు విధానము :


చిక్కుడుకాయలు, బంగాళాదుంపలు, టొమాటోలు, ఉల్లిపాయలు అన్నీముక్కలుగా కోసి పెట్టుకోవాలి.

ఉల్లిముక్కలు, అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు, కారం వేసి మెత్తగా రుబ్బాలి. స్టవ్‌మీద బాణెలిపెట్టి నూనె వేసి కాగిన తరవాత రుబ్బిన ఉల్లిముద్ద వేసి వేయించాలి.

కమ్మని వాసన వచ్చిన తరవాత చిక్కుడుకాయ ముక్కలు వేసి మరికొంతసేపు వేయించాలి.

బంగాళాదుంపముక్కలు, టొమాటో ముక్కలు వేసి ఓ గ్లాసు నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసి ప్రెషర్‌కుక్కర్ లోకి మార్చాలి.

ఒక విజిల్‌ వచ్చిన తరవాత దించి చల్లారిన తరవాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వడ్డించాలి. అంతే చిక్కుడు మసాలా కూర రెఢీ.

No comments:

Post a Comment