Thursday, May 10, 2012

రాజ్‌మా మసాలా కర్రీ

కావలసిన పదార్థాలు

  • రాజ్‌మా. 2 కప్పులు
  • ఉల్లిపాయలు. 2
  • టొమోటో. పెద్దసైజుది 1
  • అల్లం వెల్లుల్లి. 1 టీస్పూ//
  • పచ్చిమిర్చి. 3
  • టొమోటోలు. 3
  • ధనియాలపొడి. 1/2 టీస్పూ//.
  • కారం. 1 టీస్పూ//.
  • గరంమసాలా. 1/2 టీస్పూ//.
  • నూనె. 2 టీస్పూ//.
  • కొత్తిమీర. గుప్పెడు

తయారీ విధానం

రాజ్‌మాను రాత్రంతా నానబెట్టి, బాగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
బాణెలిలో నూనె వేసి కాగాక. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించాలి. కాసేపటి తరువాత ఉల్లిపాయ, టొమోటో ముక్కలను వేసి కలియబెట్టాలి.
కొద్దిసేపటి తరువాత అందులోనే ఉడికించిన రాజ్‌మా, కారం, ధనియాలపొడి, గరంమసాలాలను వేసి, బాగా కలిపి ఉడికించాలి.
మంట తగ్గించి గ్రేవీ చిక్కబడేంతదాకా ఉడికించి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే రాజ్‌మా మసాలా కర్రీ రెఢీ.

No comments:

Post a Comment