Wednesday, May 9, 2012

పచ్చిమిర్చితో బంగాళాదుంపల కూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బంగాళాదుంపలు.. 1/2 కేజీ
  • ఉల్లిపాయలు.. 100 గ్రా.
  • పచ్చిమిర్చి. 5
  • నూనె.. తగినంత
  • ఆవాలు, జీలకర్ర. 1 టీస్పూ//.
  • శనగపప్పు. 1/2 టీస్పూ//.
  • కరివేపాకు. 3 రెమ్మలు
  • ఎండుమిర్చి. 5
  • అల్లం వెల్లుల్లి పేస్ట్. 50 గ్రా.
  • ఉప్పు, కారం. తగినంత
  • టొమోటోలు. 4
  • ధనియాలపొడి. 1 టీస్పూ//.
  • పసుపు. చిటికెడు
  • కొత్తిమీర. 1/2 కట్ట

తయారు చేయు విధానము :

బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి ముక్కలు చేసుకోవాలి.
పాత్రలో నూనె వేడయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించాలి.
ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు వేయించాక టొమోటో ముక్కల్ని జత చేయాలి. ఆపై అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసి కలపాలి.
చివరిగా బంగాళాదుంప ముక్కల్ని కూడా జతచేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి వేసి కలియబెట్టాలి.
కాసేపు అలాగే ఉడికించిన తరువాత కొత్తిమీర తరుగును పైన చల్లి దించేయాలి. అంతే బంగాళాదుంపల కూర తయారైనట్లే. 

No comments:

Post a Comment