Wednesday, May 9, 2012

నువ్వుల పొడితో కూర


Picture  Recipe  

కావలసిన పదార్థాలు

  • నచ్చిన కూరలు (బీరకాయ, సొరకాయా,గోరుచిక్కుడు కాయలు):పావు కిలో(చిన్న ముక్కలుగా తరిగినవి)
  • ఉప్పు:తగినంత
  • పసుపు:చిటికెడు
  • నూనె: 2 టీస్పూ//.
  • నువ్వుల పొడి: 3 టీస్పూ//.
  • పోపు:ఆవాలు, జీలకర్ర, ఎండు మిరప కాయలు, కరివేపాకు.

నువ్వులపొడికి కావలసిన పదార్ధాలు:

తెల్లనువ్వులు:1/4 కిలో
ఎండు మిరపకాయలు: 100 గ్రాములు

నువ్వుల పొడి తయారి విధానం:

ముందుగా ఒక బాణెలి లో తెల్లనువ్వులు, మిరపకాయలు వేసి చిన్న మంటపై వేయించుకోవాలి.
నువ్వులపప్పు కొంచెం ఎర్రగ అయిపోగానే స్టవ్ మీదనించి తీసివేయాలి. బాగా చల్లరాక మెత్తగ పొడి చేసుకోవాలి.
ఈ పొడి కొద్ది రోజులు నిలవ వుంటుంది. వేడి మీద పొడిచేస్తే నువ్వుల పప్పు పొడి అవదు. ముద్ద (paste) అవుతుంది.

తయారు చేయు విధానము :

బాణెలి లో నూనె వేసి పోపు వేసుకుని, వేగాక కూరముక్కలు వేసుకుని తగినంత ఉప్పు, పసుపు వేసి కొంచెం మగ్గనివ్వలి.
కూర ముక్కలు మగ్గి నీరు తగ్గిన తరువాత నువ్వుల పొడి వేసుకోవాలి.
అంతే కూర తయారు. సొరకాయ, గోరుచిక్కుదు కాయ కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే కూర త్వరగా అవుతుంది.

No comments:

Post a Comment