Friday, May 18, 2012

కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా?

కీళ్ల నొప్పులతో బాధపడేవారు మందులవాడకం కంటే... పోషక ఆహారంపై ఆధారపడటం మేలంటున్నారు వైద్యులు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు. కూరగాయలు ఎక్కువగా ఉండే కూరలను అన్నంలో చేర్చుకుని తినాలి. పోషక ఆహారం తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులను తగ్గించవచ్చునని వైద్యులు చెబుతున్నారు.

నీళ్లు పోసి ఉడికించిన ఆహార పదార్థాలను అంటే ఇడ్లీ వంటి పదార్థాలను మాత్రమే తీసుకోవడం మంచిది. నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకు రెండు సార్లు పండ్లు తీసుకుంటూ ఉండాలి. పాలకూరను తరచుగా వండుకుంటూ ఉండాలి. ఆపిల్ వంటి పండ్లను తీసుకోవడం మంచిది.

బాదంపప్పు, చేపల కూరను తింటూ ఉంటే కీళ్ల నొప్పులను బారి నుండి తప్పుకోవచ్చునని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. గాయం తగిలినా, ఏదైనా అనారోగ్యం వచ్చినా వెంటనే శరీరం వేడెక్కడం సహజమే. ఇలాంటివి జరిగేటప్పుడు ఆహారం మాని బ్రెడ్‌ వంటి తేలిక ఆహారం తీసుకోవడం మంచిది కాదు. వైద్యుల సలహా మేరకు ఆహారాన్ని తీసుకోవడం మంచిది. పోషక ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే కీళ్ల నొప్పులను తగ్గేందుకు ఆస్కారాలున్నాయి.

No comments:

Post a Comment