Thursday, May 10, 2012

ఉల్లికారం కాకరకాయ ఫ్రై

కావలసిన పదార్థాలు

  • కాకరకాయలు(చిన్నసైజువి). 1/4 కేజీ
  • ఉల్లిపాయలు. 100 గ్రా.
  • కారం. 1 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • ఆమ్‌చూర్. 1/2 టీస్పూ//.
  • జీలకర్రపొడి. 1/2 టీస్పూ//.
  • నూనె. వేయించడానికి సరిపడా

తయారీ విధానం

కాకరకాయలను కడిగి చాకుతో వాటి పొట్టను నిలువుగా చీల్చుతూ. పైనా కిందా విడిపోకుండా చూడాలి.
తరువాత కాకరకాయల్లోని గింజల్ని తీసేయాలి. ఓ గిన్నెలో తరిగిన ఉల్లిముక్కలు, కారం, ఉప్పు, ఆమ్‌చూర్‌, జీలకర్ర.. అన్నీ వేసి ఉల్లిమసాలా తయారుచేయాలి.
ఇప్పుడు ఈ మసాలాను కాకరకాయల్లో కూరి బయటకు రాకుండా కాయల్ని లావుపాటి దారంతో కట్టేయాలి.
మందపాటి బాణెలిలో నూనె పోసి ఉల్లికారం కూరిన కాకరకాయలను వేసి మూతపెట్టి సన్ననిమంటమీద బాగా మగ్గనివ్వాలి. అంతే ఉల్లికారం కాకరకాయ ఫ్రై రెఢీ.

No comments:

Post a Comment