Thursday, May 10, 2012

శెనగపప్పుతో కాయగూరల మసాలా


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • శెనగపప్పు. 1/4కిలో
  • సొరకాయ. 1/2కిలో
  • ఉల్లిపాయలు. పెద్దవి 2
  • టొమోటోలు. 2
  • బెల్లం. చిన్నముక్క
  • చింతపండు గుజ్జు. 2 టీస్పూ//.
  • ఎండుమిర్చి. నాలుగు
  • పసుపు. 1 టీస్పూ//.
  • ఆవాలు. 1 టీస్పూ//.
  • కరివేపాకు. 1 కట్ట
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • వెల్లుల్లి. 1 టీస్పూ//.
  • కొత్తిమీర తురుము. 1 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • నూనె. 2 టీస్పూ//.
  • నెయ్యి. నాలుగు టీస్పూ//.

తయారీ విధానం

సెనగపప్పు కడిగి ఉడికించాలి. సొరకాయ తొక్కుతీసి ముక్కలుగా కోసి ఉంచాలి.
పప్పు సగం ఉడికిన తరవాత సొరకాయ ముక్కలు వేసి పూర్తిగా ఉడికించాలి.
స్టవ్‌మీద బాణెలి పెట్టి నూనె వేసి కాగాక, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి. ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
ఆపై టొమాటో ముక్కలు, పసుపు వేసి మూతపెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఉడికించిన పప్పు, సొరకాయముక్కలు, ఉప్పు, బెల్లం, చింతపండు గుజ్జు వేసి బాగా కలిపి ఓ 2 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికించాలి.
చివరగా నెయ్యి, కొత్తిమీర కూడా వేసి కలిపి దించాలి. అంతే శెనగపప్పుతో కాయగూరల మసాలా రెడీ.

No comments:

Post a Comment