పంచామృతం

కావలసిన పదార్థాలు
- పాలు - 2 టీస్పూ//.
- చక్కెర - 1/2 టీస్పూ//.
- బాగా స్మూత్ గా అయ్యే వరకూ కలియ బెట్టిన పెరుగు -1 టీస్పూ//.
- మంచి నెయ్యి - 1/4 టీస్పూ//.
- తేనె - 1/3 టీస్పూ//.
- అవసరము అనిపిస్తే అరటి పండు, తులసి ఆకులు, కొబ్బరి తురుము మున్నగు వాటిని చేర్చ వచ్చును.
తయారీ విధానం
వెడల్పాటి గిన్నె వంటి పాత్రలో జాగ్రత్తగా కలియబెట్టాలి. కేవలము ప్రసాదముగా మాత్రమే కాదు, దీనిని విడిగా చేసుకొనవచ్చును.
ఇది రుగ్మతలను పోగొడ్తుంది. ఆరోగ్య వర్ధని అని పేర్కొన వచ్చును.
చాలా మందికి ప్రసాదమును గ్రోలిన తర్వాత దోసిళ్ళును
తలకు రాసుకునే అలవాటు ఉన్నది. ఇందులోని "తేనె"వలన జుట్టు నెరిసే అవకాశము
కలదు. కాబట్టి, జాగ్రత్తగా అర చేతులను కడుక్కోవడము మంచిది.
No comments:
Post a Comment