
కావలసిన పదార్థాలు
- పెద్ద అరటిపళ్ళు 2
- చక్కెర 300 గ్రా
- కొరిన పచ్చి కొబ్బెరకోరు 1 కప్పు
- నెయ్యి 1/2 కప్పు
- ఆరంజ్ జ్యూస్. 1 కప్పు
- నేతిలో వేయించిన జీడిపప్పు. 15
తయారీ విధానం
ముందు అరటిపళ్ళు తరిగి వుంచాలి.(గుజ్జుచేసినా ఒకే)
ష్టవ్ పై మూకుడు వుంచి అందులో 1/4 కప్ నీళ్ళుపోసిబాగా పొంగువచాక అందులో
చెక్కరవేసి కాస్త పాకం వచ్చాక, 2 స్పూన్స్ నెయ్యివేసి అందులో కట్ చేసిన
అరటిపళ్ళు వేసి రంగు మారేవరకు వేయిస్తునే వుండాలి.
అందులోనే 1 స్పూన్ కొబ్బెర వెసి పచ్చివాసన పోయేవరకు కలిపి పక్కన వుంచుకోవాలి.
మూకుడులో 2 స్పూన్స్ నెయ్యి వేసి, ఆరంజ్ జ్యూస్
వేసి బాగా పొంగు వచ్చాక అందులో అరటిపళ్ళు,మిగిలిన కొబ్బెర వేయించి ముక్కలు
చేసిన జీడిపప్పు, వేసి కాస్త గట్టిపడేవరకు వుంచి తీసేయడమే.
No comments:
Post a Comment