Thursday, May 3, 2012

చిలగడదుంపతో గులాబ్ జామూన్

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • ఎర్ర చిలగడదుంపలు 850గ్రా
  • చక్కెర 350గ్రాలు
  • నెయ్యి 350గ్రాములు
  • రోజ్ ఎసెన్స్ తగినంత
  • నెయ్యి 100గ్రాములు
  • మైదా 2 టీస్పూ//

తయారీ విధానం

ముందు చిలగడదుంపలు శుభ్రంగా కడిగి కాసిని నీళ్ళు పోసి, పొయ్యి మీద పెట్టి మెత్తగా ఉడకనివ్వాలి.
ఉడికిన ఈ దుంపలపై తొక్క వొలిచి లోపల పీచువుంటే శుభ్రంగా తీసివేయాలి. మెత్తగా గుజ్జులా అయ్యేటట్లు చేతితో బాగా పిసకాలి.
మైదాలో పేరిన నెయ్యి కలిపి చిలగడదుంప గుజ్జులో పేరిన నెయ్యి ముద్ద కలిపి చేతితో బాగా పిసికి దొండకాయల మాదిరిగా ఉండలు చేసి ఉంచుకోవాలి.
పొయ్యి మీద వెడల్పాటి గిన్నెలో పంచదార పోసి లేతపాకం పట్టాలి. పాకంలో ఎసెన్స్, రంగూ కలిపి దించుకోవాలి.బాణెలి లో నెయ్యి పోసి మరిగించాలి.
అందులోకి ఇదివరలో దొండకాయ మాదిరిగా చేసుకొన్న ఉండలని వేసి దోరగా వేయించాలి.
ఆ తర్వాత వాటిల్ని పాకంలోకి వెయ్యాలి. మామూలు గులాబ్ జాముల్లానే తినడానికి బావుంటాయు.

No comments:

Post a Comment