Thursday, May 3, 2012

కజ్జికాయలు

Picture  Recipe

ఒక 60 కజ్జి కాయలు చెయ్యడానికి కావలసిన పదార్థాలు:

  • మైదా - 500 గ్రా
  • 4-5 చమ్చాల నెయ్యి
  • నూనె - తగినంత
  • ఉప్పు - తగినంత

లోన నింపుకునే మిశ్రమానికి కావలసిన పదార్ధాలు:

  • 1/4 కప్పు తురిమిన కొబ్బరి
  • 1 కప్పు వేయించిన శనగపప్పు
  • 1 కప్పు చక్కెర
  • తగినంత ఏలక్కుల పొడి

తయారీ విధానం

మైదాలో కొంచం ఉప్పు వేసుకొని చపాతీపిండి లాగ చేసుకోవాలి. తర్వాత దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, ఒక గిన్నెలో మూత పెట్టి ఒక అరగంట ఉంచాలి.
ఇంకో పక్కన బాణెలిని స్టవ్వు మీద పెట్టుకొని ఒక చమ్చా నెయ్యి వేసి, తురిమిని కొబ్బరిని చిన్న సెగపై ఎర్రగా వేపాలి. దీనిని తీసి పక్కన పెట్టి, అదే బాణెలిలో ఇంకొక చంచా నెయ్యి వేసి, అందులో వేయించిన శెనగ పప్పు పొడి వేసి, దోరగా వేపుకోవాలి. దీనిని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి 
తర్వాత వేపిన పొడికి కొబ్బరి తురుము, ఏలకుల పొడి, సన్నగా తరిగిన కాజు కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఇందాక చపాతి పిండిని ఉండలుగా చేసిపెట్టుకున్నాం కదా , దాన్నిని చిన్న చిన్న పూరీలు గా వత్తుకోవాలి.
ఒక్కక్క పురిలో ఇందాకల చేసి పెట్టుకున్న పప్పు, కొబ్బరి మిశ్రమాన్ని ఒక చెంచాడు పెట్టి ఆ పురిని సగానికి మడత పెట్టుకోవాలి. కజ్జికాయ ఆకారాన్ని బొమ్మలో ఉన్నట్లుగా. మడత ఊడిరాకుండా జాగ్రత్తగా నొక్కుకోవాలి.
ఇప్పుడు ఒక బాణెలిలో తగినంత నూనె పోసుకొని, అది మధ్యస్తంగా వేడి అయిన తర్వాత తయారు చేసుకున్న కజ్జికాయలని వేపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత నూనె కారకుండా ఉండేట్లు తీసివేసుకోవాలి.
ఈ కజ్జి కాయలు గాలి దూరని డబ్బాలలో పెట్టుకుంటే తాజాగా ఒక వారం రోజు వాడచ్చు. ఇవి 3-4 వారాలు నిలువ ఉంటాయి.

No comments:

Post a Comment