
కావలసిన పదార్థాలు
- మైదాపిండి. 1/2కేజీ
- కారం. వంద గ్రా.
- ఉప్పు. తగినంత
- నూనె. సరిపడా
తయారీ విధానం
మైదా పిండిలో తగినంత ఉప్పు, కారం వేసి, నీళ్ళు పోసి బాగా కలపాలి. స్టవ్‌పై బాణలి పెట్టి తగినంత నూనె పోసి వేడి చేయాలి.
గులాబీ పువ్వు కాడకు (ఇది స్టీల్ సామాన్ల కొట్టులో దొరుకుతుంది) కొద్దిగా నూనె రాసి, దాన్నిండా పిండి నింపి కాగుతున్న నూనెలో వేయాలి.
ఇలా చేస్తే. గులాబీ పువ్వులా ఉండే అచ్చు నూనెలో అలాగే పడుతుంది. ఇది బాగా ఎర్రగా వేగిన తరువాత పళ్ళెంలోకి తీసుకోవాలి.
కారం చాలదనుకునేవారు ఇలా వేడిగా ఉన్నప్పుడే మరికొంత కారంపొడిని చల్లుకోవచ్చు. అంతే మైదా గులాబీలు రెడీ !
No comments:
Post a Comment