
కావలసిన పదార్థాలు
- కాలీఫ్లవర్. 1/2కేజీ
- పాలు. 3/4 లీటర్
- మిరియాలపొడి. 1/2 టీస్పూ//.
- ఉప్పు. తగినంత
- మైదా. 50 గ్రా.
- వెన్న. 50 గ్రా.
- మిల్క్‌ఛీజ్. 50 గ్రా.
- రస్కులపొడి. 1/4 కప్పు
తయారీ విధానం
ఉప్పు నీళ్లలో కడిగిన కాలీఫ్లవర్‌ను ముక్కలుగా తుంచి నీళ్లలో వేసి ఉడికించాలి.
కేకు గిన్నెలోగానీ ఓవెన్‌లో పెట్టే గ్లాస్ బౌల్‌లో
గానీ ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి కాస్త ఉప్పు, మిరియాలపొడి చల్లి పక్కన
ఉంచాలి.
ఓ గిన్నెలో వెన్న, మైదా కలిపి దోరగా వేయించి, ఆపై
పాలు కలపాలి. పాలు, మైదా మిశ్రమాన్ని సన్నని మంటమీద ఉంచి తిప్పుతూ
ఉడికిస్తే వైట్ సాస్ తయారవుతుంది.
ఈ సాస్‌లో కాస్త ఉప్పు, మిరియాల పొడి, కాస్తంత ఛీజ్ తురుమును కలిపి. ఈ మొత్తం మిశ్రమాన్ని కాలీఫ్లవర్ ముక్కలమీద పోయాలి.
ఇప్పుడు మిగిలిన ఛీజ్‌ను కూడా తురిమి, దాంతోపాటు రస్కులపొడిని ముక్కలమీద చల్లి ఓవెన్‌లో పెట్టి ఐదు నిమిషాలు ఉడికించి దించాలి.
No comments:
Post a Comment