
కావలసిన పదార్థాలు
- మైదాపిండి. 4 కప్పులు
- వంట సోడా. 1/2 టీస్పూన్
- పులిసిన పెరుగు. 1.1/2 కప్పు
- క్యారెట్ తురుము. 2 కప్పులు
- నెయ్యి. తగినంత
- నూనె, ఉప్పు. తగినంత
తయారీ విధానం
ముందుగా పెరుగులో వంటసోడా, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి.
కాసేపటి తరువాత పెరుగు మిశ్రమంలో మైదా పిండి, క్యారెట్ తురుము వేసి బాగా కలిపి, చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు పై పిండిని తడిగుడ్డతో మూసి, సుమారు ఐదారు గంటలపాటు అలాగే ఉంచేయాలి.
ఆ తరువాత తడిగుడ్డను తీసివేసి, పిండిని మళ్లీ మెత్తగా చేసుకుని, కొద్ది కొద్దిగా తీసి చపాతీల్లాగా చేసుకోవాలి.
ఇలా చేసుకున్న వాటిని పెనం వేడిచేసి నెయ్యి, లేదా నూనె వేస్తూ... రెండువైపులా బంగారు వర్ణం వచ్చేలా కాల్చి తీసేయాలి.
అంతే క్యారెట్ బట్టూరా తయారైనట్లే.. వీటిని ఏదైనా పప్పుతో తయారైన వేడి వేడి కూరతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment