
కావలసిన పదార్థాలు
- బాంబినో వెర్మిసెల్లి. 100 గ్రాములు
- ఉల్లిపాయలు.1
- నూనె. తగినంత
- ఉప్పు. సరిపడా
- పెరుగు. 1/2 గ్లాసు
- పచ్చిమిర్చి. 3
- బియ్యంపిండి. తగినంత
- వంటసోడా :తగినంత
తయారీ విధానం
ముందుగా వెర్మిసెల్లిని పెరుగులో గంటసేపు
నానబెట్టాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని సన్నగా తరిగి వెర్మిసెల్లితో
పాటుగా పెరుగులో కలుపుకోవాలి.
అలాగే బాగా నానిన తరువాత తగినంత బియ్యంపిండిలో వెర్మిసెల్లి మిశ్రమాన్ని కలపాలి.
దీనికి కావాల్సినంత ఉప్పు, చిటికెడు వంటసోడాను కలిపి, దోసెలు పోసేందుకు అనువుగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పై దోశెల పెనం పెట్టి, కాలిన తరువాత నూనె పూసి పై మిశ్రమంతో దోసెలు పోయాలి.
పైన అవసరమనుకుంటే కాస్తంత నెయ్యిని చల్లి రెండువైపులా దోశెను ఎర్రగా కాల్చి తీయాలి. అంతే బాంబినో వెర్మిసెల్లి దోశెలు రెడీ అయినట్లే.
No comments:
Post a Comment