Thursday, May 3, 2012

రెడ్ కిడ్నీ బీన్ సలాడ్

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • రాజ్‌మా (రెడ్ బీన్). 1 కప్పు
  • వెల్లుల్లి. 4 రెబ్బలు
  • నూనె. 1.1/2 టీస్పూ//.
  • టొమోటో. 100 గ్రా.
  • క్యాబేజీ. 100 గ్రా.
  • పచ్చిమిర్చి. 2
  • ఉల్లిపాయలు. 50 గ్రా.
  • ఉప్పు. తగినంత
  • నిమ్మరసం. 1 టీస్పూ//.

తయారీ విధానం

రాజ్‌మా ను 3 గంటలపాటు నానబెట్టి, కుక్కర్‌లో ఉడికించాలి. టొమోటోలను నాలుగు ముక్కలుగా కోయాలి.
క్యాబేజీ, ఉల్లిపాయలను కూడా 1.1/2 అంగుళాల సైజులో ముక్కలుగా కోసి, పక్కన పెట్టాలి.
ఓ బాణెలి లో నూనె పోసి వెల్లుల్లి ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.
తరువాత ఉల్లి, టమోటో, క్యాబేజీ ముక్కలను కూడా వేసి బాగా కలియబెట్టి వేయించాలి.
ఇవి ఉడికిన తరువాత, రాజ్‌మాను కూడా కలిపి వేయించాలి.
సరిపడా ఉప్పు, నిమ్మరసం కలపాలి. అంతే రెడ్ కిడ్నీ బీన్ సలాడ్ రెడీ.

No comments:

Post a Comment