Thursday, May 3, 2012

పెసరపప్పుతో కారంచెక్కలు

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బియ్యపు పిండి. 1 కిలో
  • పెసరపప్పు. 1/4 కిలో (పొట్టు లేనివి)
  • డాల్డా లేదా వెన్న. 200 గ్రాములు
  • అల్లం. 50 గ్రాములు
  • పచ్చి మిరపకాయలు. 6
  • జీలకర్ర. 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు. తగినంత
  • నూనె. 3/4 కిలో

తయారీ విధానం

బియ్యం పిండిని ముందుగా జల్లించుకోవాలి. పెసర పప్పును 1 గంట నానబెట్టాలి. అల్లం, మిరపకాయలను మెత్తని పేస్టులా చేసుకోవాలి.
బియ్యపు పిండిలో నానిన పెసర పప్పును, అల్లం పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని, డాల్డాను, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి.
తరువాత పిండిని నాలుగు సమాన భాగాలుగా చేసుకుని. భాగాన్ని నీళ్ళతో తడుపుతూ చెక్కలను తయారు చేసుకోవాలి.
వీటిని బాగా కాగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చేదాకా కాల్చి తీసేయాలి. అంతే పెసరపప్పుతో కారంచెక్కలు రెడీ.

No comments:

Post a Comment