
కావలసిన పదార్థాలు
- మొలకెత్తిన పెసలు. 2 కప్పులు
- నువ్వుల నూనె. 1 టీస్పూ//.
- సన్నగా తరిగిన అల్లం. 1 టీస్పూ//.
- సోయా సాస్. 1 టీస్పూ//.
- బాదంపప్పులు. 100 గ్రా.
- తేనె. 1 టీస్పూ//.
తయారీ విధానం
బాణెలిలో నువ్వుల నూనె వేసి, కాగిన తరువాత అల్లం తరుగు, పెసర మొలకలు వేసి సన్నని మంటమీద వేయించాలి.
దాంట్లోనే సోయాసాస్, బాదంపప్పు కూడా వేసి, కాసేపు వేయించి దించేయాలి.
తరువాత ఈ మిశ్రమంలో తేనె వేసి బాగా కలపాలి. అంతే పెసర మొలకలతో అల్లం స్పెషల్ రెఢీ !
No comments:
Post a Comment