
కావలసిన పదార్థాలు
- క్యారెట్‌తురుము. 1 కప్పు
- చాట్ మసాలా. కొద్దిగా
- బియ్యంపిండి. 2 కప్పులు
- నూనె. తగినంత
- పంచదార. 2 టీస్పూ//.
- ఉప్పు. తగినంత
తయారీ విధానం
పిండిని జల్లించాలి. అందులోనే నాలుగు టేబుల్‌స్పూన్ల నూనె, ఉప్పు, క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి.
తరవాత తగినన్ని నీళ్లు చల్లుతూ పూరీపిండిలా బాగా కలపాలి. పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పూరీల్లా వత్తాలి.
తరవాత పూరీ మధ్యలో చాకుతో పొడవుగా కోయాలి. అంచుల వరకూ కొయ్యకూడదు.
తరవాత కోసిన పూరీని బెలూన్ మాదిరిగా గుండ్రంగా
వచ్చేలా చుడుతూ చివర్లు మాత్రం విడిపోకుండా కొద్దిగా తడి చేసి కజ్జికాయల
మాదిరిగానే చేత్తో నొక్కి ఉంచాలి.
ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తరవాత బాణలిలో నూనె
పోసి కాచి, ఎర్రగా వేయించి తీయాలి. చల్లారాక వీటిమీద కొద్దిగా చాట్‌మసాలా
చల్లితే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి
No comments:
Post a Comment