Thursday, May 3, 2012

గోబీ గోళీలు


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • కాలీఫ్లవర్ 1
  • బంగాళాదుంపలు 1/4 కేజీ
  • అల్లంవెల్లుల్లి పేస్ట్.. 1 టీస్పూ//.
  • ఉల్లిపాయలు.. 2
  • పచ్చిమిర్చి.. 4
  • మిరియాలపొడి.. 1 టీస్పూ//
  • నిమ్మకాయ 1
  • కొత్తిమీర.. 1 కట్ట
  • శనగపిండి.. 100 గ్రా.
  • బ్రెడ్ పొడి.. 150 గ్రా.
  • ఉప్పు.. తగినంత
  • నూనె.. సరిపడా

తయారీ విధానం

కాలీఫ్లవర్‌ని సన్నగా తరిగి, కాస్త ఉప్పేసి ఉడికించి, నీరు వార్చి ఆరబెట్టాలి.
బంగాళాదుంపల్ని ఉడికించి, తొక్కతీసి మెదిపి పెట్టుకోవాలి.
బాణెలిలో కొద్దిగా నూనె వేసి తరిగిన ఉల్లి, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన కాలీఫ్లవర్, ఆలూ వేసి కాసేపు వేయించుకోవాలి.
దీనికి ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం కలిపి దించి చల్లార్చాలి.
ఈ మిశ్రమాన్ని చిన్నసైజు నిమ్మకాయలంత ఉండలుగా చేసుకోవాలి..
ఇప్పుడు శనగపిండిని జారుగా కలిపి, ఉండల్ని అందులో ముంచి, బ్రెడ్ పొడిలో దొర్లించి నూనెలో దోరగా వేయించాలి.
వీటిని వేడి వేడిగా సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

No comments:

Post a Comment