Thursday, May 3, 2012

తీపినిమ్మపూరీలు

Picture  Recipe


కావలసిన పదార్థాలు

  • మైదాపిండి - 1 కప్పు
  • చక్కెర - 1 కప్పు
  • నెయ్యి - 1 కప్పు
  • నిమ్మకాయలు - 2
  • ఉప్పు - చిటికెడు
  • వెన్న - నిమ్మకాయంత

తయారీ విధానం

మైదాపిండిలో ఉప్పు, వెన్న, కొంచెం నీళ్ళు పోసి పూరీలపిండి లానే కలుపుకొని, పూరీలు వత్తి పెట్టుకోవాలి.
తర్వాత పంచదారలో కాసిన్ని నీళ్ళు పోసి, తీగపాకం వచ్చేదాకా గరిటతో తిప్పుతూ, అడుగు అంటుకోకుండా జాగ్రత్త పడాలి.
తీగపాకం వచ్చాక పాకం గిన్నెను దించి అందులోకి నిమ్మరసం పిండాలి. నిమ్మ వాసన ఎక్కువ కావాలనుకొనేవాళ్ళు లెమన్ ఎస్సెన్స్ చేర్చుకోవచ్చు.
బాణెలిలో కప్పు నెయ్యి వేసి, అది మరిగాక ముందుగా చేసి వుంచుకొన్న పూరీలను వేయించాలి.
వేగిన పూరీలు పాకంలో వెయ్యాలి.
వీటిని వేడిగా తింటే బాగుంటుంది

No comments:

Post a Comment