
- తయారీ చేయుటకు పట్టు సమయం :
- 50 నిమిషాలు
- కావలసిన పదార్థాలు సమకూర్చుకొనుటకు :
- 30 నిమిషాలు
- వండుటకు :
- 20 నిమిషాలు
కావలసిన పదార్థాలు
- ఉల్లికాడలు. 10
- టొమోటోలు. 3
- కీరదోస ముక్కలు. 1 కప్పు
- నిమ్మరసం. 2 టీస్పూ//.
- బాదం పప్పులు. 10
- కొత్తిమీర. 1 1/2 కట్ట
- పుదీనా కట్ట. 1
- ఉప్పు. తగినంత
తయారీ విధానం
ఒక గిన్నెలో కాసిన్ని మంచినీళ్లుపోసి స్టవ్‌పై ఉంచాలి.
నీళ్లు మరిగాక అందులో ఉల్లికాడలు, కీరదోసకాయ ముక్కలు, టొమోటో ముక్కలను వేసి ఒక్క నిమిషంపాటు ఉంచి తీసేయాలి.
ఈ ముక్కలకు నిమ్మరసం కలిపి, కొద్దిగా దంచుకున్న బాదంపప్పు ముక్కలు, తగినంత ఉప్పు పైన చల్లాలి.
చివర్లో పుదీనా, కొత్తిమీర తరుగులను పైన చల్లి అందంగా అలంకరించి సర్వ్ చేయాలి. అంతే ఉల్లికాడలు దోసకాయ సలాడ్ సిద్ధమైనట్లే.
No comments:
Post a Comment