Thursday, May 3, 2012

పొటాటో పెప్పర్ బర్డ్ నెస్ట్

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బంగాళాదుంపలు. 1/2 కేజీ
  • ఉప్పు. తగినంత
  • మిరియాలపొడి. 2 టీస్పూ//.
  • నిమ్మకాయలు. 2
  • సేమ్యా. 200 గ్రా.
  • కోడిగుడ్లు. 2
  • నూనె వేయించేందుకు సరిపడా

తయారీ విధానం

బంగాళాదుంపల్ని తొక్క తీసి ఉడికించాలి. దుంపలు కాస్త చల్లారాక వాటిని గరిటెతో మెత్తగా మెదపాలి.
అందులోనే మిరియాలపొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కోడిగుడ్డు ఆకారంలో ఉండలుగా చేయాలి.
ఓ చిన్నగిన్నెలో గుడ్లసొన వేసి బాగా గిలకొట్టాలి. ఉండలుగా చేసిన దుంప ముద్దల్ని గుడ్డుసొనలో ముంచి తరవాత సేమ్యాలో దొర్లించి తీయాలి.ఇలానే అన్నీ చేసుకోవాలి.
ఓ బాణలిలో సరిపడా నూనె పోసి కాగుతుండగా, పైన తయారు చేసిన ఉండల్ని వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి పొటాటో పెప్పర్ బర్డ్ నెస్ట్ రెఢీ.

No comments:

Post a Comment