
కావలసిన పదార్థాలు
- పెద్ద శెనగలు. 1 కప్పు
- దోసకాయ ముక్కలు. 1 కప్పు
- టొమోటో ముక్కలు. 1/2 కప్పు
- బంగాళాదుంప ముక్కలు. 1/4 కప్పు
- పెరుగు. 1 కప్పు
- ఉప్పు. తగినంత
- మిరియాల పొడి. కొద్దిగా
తయారీ విధానం
బంగాళాదుంప ముక్కలు పది నిమిషాలపాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. శెనగలను కూడా మరీ మెత్తగా కాకుండా ఉడికించి ఉంచాలి.
ఒక బౌల్‌లో బంగాళాదుంప ముక్కలతోపాటు టొమోటో, ఉల్లిపాయ, దోసకాయ ముక్కలు, శెనగలు, పెరుగు వేసి బాగా కలియబెట్టాలి.
తరువాత అందులోనే ఉప్పు, మిరియాలపొడి కూడా వేసి మరోసారి కలపాలి.
చివర్లో అవసరం అనుకుంటే దీనికి కాస్తంత క్రీమ్ కూడా కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంతే వెరైటీగా ఉండే శెనగల సలాడ్ రెడీ
No comments:
Post a Comment