Thursday, May 3, 2012

వెజిటబుల్ జైపురి

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • క్యారెట్లు. 500 గ్రా
  • బీన్స్. 500 గ్రా
  • కాలీఫ్లవర్. 300 గ్రా.
  • ఉల్లిపాయలు. 100 గ్రా.
  • పనీర్. 200 గ్రా.
  • టమోటో. 200 గ్రా.
  • కారం. 2 టీస్పూ//.
  • పసుపు. 1 టీస్పూ//.
  • జీడిపప్పు. 60 గ్రా.
  • గసగసాలు. 40 గ్రా.
  • పెరుగు. 2 కప్పులు
  • అల్లం, వెల్లుల్లి. 3 టీస్పూ//.
  • కొత్తిమీర. 2 కట్టలు
  • నూనె. తగినంత
  • ఉప్పు. సరిపడా.

తయారీ విధానం

కూరగాయలన్నింటినీ కడిగి శుభ్రం చేసి, సన్నటి ముక్కలుగా తరిగి ఉంచాలి.
మరుగుతున్న నీటిలో ఈ కూరగాయల ముక్కల్ని వేసి ఐదు నిమిషాలుంచి తీసివేయాలి.
బాణెలిలో నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలను వేసి వేయించాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి మిశ్రమం, కారం, పసుపు, జీడిప్పపు, గసగసాల ముద్ద వేసి దోరగా వేయించాలి.
తరువాత ఉడుకుతున్న మిశ్రమంలో ఉడికించిన పక్కన ఉంచిన కూరగాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో పెరుగు, టొమోటోలు, తగినంత ఉప్పు కలిపి చిక్కబడేదాకా ఉడికించాలి.
కూర ఉడుకుతుండగానే పనీర్ తురుమును కూడా అందులో వేసి కలియబెట్టాలి. కూర బాగా ఉడికిన తరువాత దించివేసి కొత్తిమీర చల్లి వడ్డించాలి. అంతే వెజిటబుల్ జైపురి రెడీ.

No comments:

Post a Comment