
కావలసిన పదార్థాలు
- పచ్చి అరటికాయలు. 4
- నానబెట్టిన శెనగపప్పు. 1 కప్పు
- ఉల్లిపాయలు. 2
- కొత్తిమీర. 1 కట్ట
- బియ్యంపిండి. 2 టీస్పూ//.
- పచ్చిమిర్చి. 4 ఉప్పు.
- తగినంత అల్లం.
- నూనె. వేయించేందుకు సరిపడా
తయారీ విధానం
అరటికాయలను ప్రెషర్‌కుక్కర్‌లో ఉడికించి తొక్క తీసేయాలి. చల్లారాక వాటిని మెత్తగా పిసికి పక్కన ఉంచాలి.
నానబెట్టిన శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం. అన్నీ వేసి నీళ్లు పోయకుండా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని అరటికాయ ముద్దలో కలపాలి.
ఉల్లిముక్కలు, బియ్యప్పిండి, ఉప్పు, కొత్తిమీర తురుము కూడా కలపాలి.
ఈ ముద్దను గుండ్రంగా లేదా అరచేతిలో చిన్న వడలుగా చేసి నూనెలో ఎర్రగా వేయించి తీయాలి. అంతే అరటికాయ శనగపప్పు వడ రెఢీ.
No comments:
Post a Comment