కావలసిన పదార్థాలు
- పెసరపప్పు. 150 గ్రా
- మినపప్పు. 150 గ్రా
- కందిపప్పు. 150 గ్రా
- బియ్యము. 150 గ్రా
- ఆలుగడ్డలు. 2
- ఉల్లి గడ్డ. 1
- క్యాబేజీ. తరుగు 1 కప్పు
- పచ్చిమిర్చి. తరుగు 1/2 కప్పు
- జీలకర్ర. 2 టీస్పూ//
- కొత్తిమీర. తరుగు 1 కప్పు
- నూనె. కొద్దిగా
- ఉప్పు. సరిపడా
తయారీ విధానం
పెసర, మినప, కంది, శెనగ పప్పులను గంటసేపు నానెబెట్టి రుబ్బుకోవాలి.
ఈ పిండిలో ఉల్లిగడ్డ, క్యాబేజీ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర తరుగుల్ని చేర్చుకోవాలి.
ఈ మిశ్రమం ఇడ్లీ పిండిలా తయారైన తర్వాత. కొద్ది కొద్దిగా తీసుకుని పెనం మీద దోసెలుగా పోసి ఎర్రగా కాలిన తర్వాత దించేయాలి.
అంతే వెజిటబుల్స్‌తో తయారైన అట్టు సిద్ధమైనట్లే..! దీన్ని వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment