
కావలసిన పదార్థాలు
- బ్రెడ్ స్లైసులు. 2
- వెల్లుల్లి పేస్ట్. 1 టీస్పూ//
- ఉప్పు. తగినంత
- మిరియాలపొడి. 1 టీస్పూ//
- వెన్న. 2 టీస్పూ//
- ఛీజ్ ముక్కలు. 1/4 కప్పు
- పచ్చిమిర్చి తరుగు. 2 కాయలవి
- ఉల్లిపాయ తరుగు. 1 టీస్పూ//
తయారీ విధానం
వెన్న, మిరియాల పొడి, వెల్లుల్లి పేస్ట్, ఉప్పులను
ఒక పాత్రలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసులకు
రెండువైపులా పూయాలి.
ఇప్పుడు ఛీజ్ ముక్కలు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగులను మిక్స్ చేసి బ్రెడ్ స్లైసులపై చల్లాలి.
స్టవ్‌పై పెనం పెట్టి, కాస్తంత వెన్న వేసి బ్రెడ్
స్లైసులను రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఛీజ్‌తో గార్లిక్ టోస్ట్
రెడీ అయినట్లే.
వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే, టమోటో సాస్‌తోగానీ, చిల్లీ సాస్‌తోగానీ కలిపి తింటే, చాలా రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment