పిల్లలకు..
అమ్మానాన్నలే తోడూనీడగా ఉండాలని మానసిక వైద్యులు అంటున్నారు. ఇంకా బుల్లి
బుడతడు ముద్దుముద్దుగా వాదిస్తుంటే చూడ ముచ్చటగానే వుంటుంది. పెద్దలకు.
అయితే సహజంగా వాదనంతా పళ్ళు శుభ్రం చేసుకోవడం గురించో, పక్క నీటుగా
వుంచుకోవడం గురించో, పుస్తకాలను ఓ పద్ధతిలో సర్దుకోవడం గురించి వుంటుంది.
పిల్లలకు చిన్నప్పటినుంచి ఈ నైపుణ్యాలు నేర్పడంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. ఏదో ఒక రోజున పిల్లలు ఎదిగి స్వతంత్రంగా జీవిస్తారు. పిల్లలు పెరిగే కొద్దీ వారి మేధస్సు వికసిస్తుంది. వారిలో నిబిడీకృతమై వున్న సృజనాత్మక శక్తి బహిర్గతమవుతుంది.
తల్లిదండ్రులు పిల్లల అభిరుచుల్ని, మేధాశక్తిని, ప్రత్యేక కౌశలాలను గుర్తించాలి. పిల్లలు అల్లరికి మారుపేరు. అల్లరి శృతిమించకూడదని ఆంక్షలు పెడతాం. ఇది సరికాదంటారు మనో వైజ్ఞానికులు. ఇప్పుడు వాళ్లకు విధించే శిక్షలు ఉత్తరోత్తరా వారి ప్రవర్తనపైనా, ఉద్వేగాలపైన ప్రభావం చూపిస్తాయంటున్నారు. శిక్షలు కొత్త సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పించే విషయంలో వారి వయసును, మనసును పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు పరిశోధకులు.
ఆరునుంచి పదమూడేళ్ళ మధ్య వయస్సు చాలా సున్నితమైనది. శారీరకంగా, మానసికంగా, భావాత్మకంగా వారిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇతరుల మీద ఆధారపడకూడదన్న తపన, స్వేచ్ఛగా వ్యవహరించాలన్న కోరిక, బయటి ప్రపంచాన్ని తెలుసుకోవాలి అన్న కుతూహలం వాళ్ళలో కనిపిస్తాయి.
ఎన్నో విషయాలలో పిల్లలు తమ సొంత తెలివితేటలను ఉపయోగించడం ముచ్చటవేస్తుంది. అయినా అప్పుడప్పుడు పనుల్ని తప్పించుకోవడానికి ఏవో సృజనాత్మక మైన సాకులు చెబుతుంటారు. సో.. అమ్మానాన్నలో ఎదిగే పిల్లలకు తోడూనీడగా ఉండాలని మనో వైజ్ఞానికులు అంటున్నారు.