కావలసిన పదార్థాలు
- క్యారట్ ముక్కలు. 1 కప్పు
- నూనె. 2 టీస్పూ//
- పసుపు. చిటికెడు
- పచ్చిమిర్చి. 2
- ఎండుమిర్చి. 2
- నువ్వులు.. 1 టీస్పూ//
- ధనియాలు.. 1/2 టీస్పూ//
- వెల్లుల్లి రేకలు. 4
- చింతపండు. కాస్తంత
- పోపు దినుసులు. 1/2 టీస్పూ//
- ఇంగువ. చిటికెడు
- కరివేపాకు. 1 రెమ్మ
- ఉప్పు. తగినంత
- కొత్తిమీర. సరిపడా
తయారీ విధానం
బాణెలి లో ఒక టీస్పూన్ నూనె వేసి వేడయ్యాక
పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు, వెల్లుల్లి రేకలు, చింతపండు
వేసి రెండు నిమిషాలపాటు వేయించాలి.
ఆపై క్యారట్ ముక్కల్ని కూడా వేసి మరో ఐదు నిమిషాలపాటు వేయించాలి.
ఇవి కాస్త చల్లారిన తరువాత ఉప్పు జతచేసి రోటీలో వేసి రుబ్బుకోవాలి.
తరువాత అదే బాణెలి లో మిగతా నూనె వేసి పోపు గింజలు వేసి.. అవి చిటపటలాడిన తరువాత కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టాలి.
దీన్ని రోట్లో రుబ్బుకున్న పచ్చడిలో వేసి కలియబెట్టాలి.
చివర్లో పైన కొత్తిమీర తరుగుతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే క్యారట్ రోటీ పచ్చడి తయార్.
No comments:
Post a Comment