కావలసిన పదార్థాలు
- సన్నగా తరిగిన చుక్కకూర. 3 కట్టలు
- పచ్చిమిర్చి. నాలుగు
- జీలకర్ర. 2 టీస్పూ//
- వెల్లుల్లి రేకలు. 4
- పోపు కోసం.
- ఆవాలు. 1/2 టీస్పూ//
- మినప్పప్పు. 1 టీస్పూ//
- శనగపప్పు.. 1 టీస్పూ//
- ఎండుమిర్చి. 2
- కరివేపాకు. 2 రెబ్బలు
- నూనె. 1 టీస్పూ//
- ఉప్పు. తగినంత li>
- ఉప్పు. తగినంత
తయారీ విధానం
బాణెలి లో నూనె వేసి వేడయ్యాక పచ్చిమిర్చి వేసి మూడు నిమిషాలపాటు వేయించి పక్కనపెట్టి, చల్లారనివ్వాలి.
అదే బాణెలి లో చుక్కకూరని వేసి దాదాపు 5 నిమిషాలపాటు వేయించి మంట తగ్గించాలి.
జీలకర్రను గ్రైండ్ చేసి, వెల్లుల్లి, వేపుకున్న పచ్చిమిర్చిలను కూడా అందులో జతచేసి నూరాలి.
చివర్లో చుక్కకూరను, తగినంత ఉప్పును వేసి మెత్తగా నూరాలి.
ఇప్పుడు బాణెలి లో నూనె వేడయ్యాక ఆవాలు వేసి చిట పట లాడాక మినప్పప్పును వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి.
తరువాత అందులోనే కరివేపాకు, ఎండుమిర్చి వేసి
వేయించి మంట తగ్గించి ఈ మిశ్రమాన్ని నూరి ఉంచుకున్న చుక్కకూర పచ్చడిలో
కలిపి పోపు పెట్టాలి. అంతే చుక్కకూర పచ్చడి సిద్ధమైనట్లే.
No comments:
Post a Comment