కావలసిన పదార్థాలు
- మునగాకులు. 1 కప్పు
- నూనె. 2 టీస్పూ//.
- ఎండుమిర్చి. 6
- శెనగపప్పు. 1 టీస్పూ//.
- మినప్పప్పు. 1 టీస్పూ//.
- చింతపండు. నిమ్మకాయంత
- ఉప్పు. తగినంత
- కొబ్బరితురుము.2 టీస్పూ//.
- ఆవాలు. తగినన్ని
- ఇంగువ. చిటికెడు
తయారీ విధానం
బాణీలి లో టీస్పూను నూనె వేసి వేడిచేయాలి. ఎండుమిర్చి, సెనగపప్పు, మినప్పప్పు వేయించి తీయాలి.
అదే బాణీలి లో మునగ ఆకును బాగా వేయించాలి.
చల్లారిన మునగ ఆకు, వేయించిన ఎండుమిర్చి,
సెనగపప్పు, మినప్పప్పు, చింతపండు, ఉప్పు, కొబ్బరి... అన్నీ వేసి మిక్సీలో
మెత్తగా గ్రైండ్ చేయాలి.
చివరగా బాణీలి లో మరో టీస్పూను నూనె వేసి ఆవాలు, ఇంగువతో పోపు పెట్టాలి. ఈ చట్నీ రొట్టెల్లోకీ, అన్నంలోకీ కూడా చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment