కావలసిన పదార్థాలు
- బీరకాయలు. 4
- కొత్తిమీర తరుగు. 1 కప్పు
- పచ్చిమిర్చి. 6
- శనగపప్పు, 1
- మినప్పప్పు. 1 టీస్పూ//.
- జీలకర్ర. 1/2 టీస్పూ//.
- నువ్వులు. 1 టీస్పూ//.
- నిమ్మరసం. 3 టీస్పూ//.
- నూనె. 6 టీస్పూ//.
- ఆవాలు, జీలకర్ర. 1 టీస్పూ//.
- ఎండుమిర్చి. 4
- ఇంగువ. 1/2 టీస్పూ//.
- కరివేపాకు. 3 రెమ్మలు
- నూనె. 1 టీస్పూ//.
తయారీ విధానం
బాణెలి లో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోనే నువ్వులను వేయించి పక్కకు తీసేయాలి.
పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి వేసి ఐదునిమిషాల పాటు వేయించి చల్లార్చాలి.
అదే బాణెలి లో ఒక టీస్పూన్ నూనె వేసి బీరకాయ ముక్కలను ఐదు నిమిషాలపాటు ప్రై చేసి దించి చల్లార్చాలి.
ఇప్పుడు వేయించిన శనగపప్పు, మినప్పప్పు, జీలకర్రలను గ్రైండ్ చేయాలి.
ఆ తర్వాత నువ్వులను పొడిచేసి అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, వేయించిన బీరకాయ ముక్కలను వేసి గ్రైండ్ చేయాలి.
పాన్‌లో నూనె వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి కొన్ని నిమిషాలు వేయించాలి.
మంట తీసివేసి ఈ పోపును గ్రైండ్ చేసిన మిశ్రమంలో కలపాలి. అంతే పచ్చడి రెడీ.
No comments:
Post a Comment