కావలసిన పదార్థాలు
- కందదుంప. ½ కేజీ
- గసగసాలు. 2 టీస్పూ//
- లవంగాలు. 6
- అల్లం. చిన్న ముక్క
- యాలక్కాయలు. 6
- వెల్లుల్లి. 2 రేకలు
- దాల్చిన చెక్క. కొద్దిగా
- ఉప్పు. తగినంత
- నూనె. సరిపడా
- కారం. సరిపడా
తయారీ విధానం
ముందుగా కంద దుంపను కడిగి బాగా చిన్న చిన్న ముక్కలుగా అంటే కైమా మాదిరిగా తరగాలి.
తర్వాత దాన్ని కుక్కర్‌లో ఉడక బెట్టి బైటకు తీసి గుడ్డలో వేసి మరీ గట్టిగా కాకుండా, ఓ మోస్తరుగా పిండాలి.
మసాలా దినుసులన్నీ కలిపి పొడికొట్టి ఉంచుకోవాలి.
తర్వాత పొయ్యి మీద బాణెలి పెట్టి అందులో నూనె వేసి
బాగా కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడిని వేసి రెండు నిముషాలు
వేయించి వెంటనే కంద ముక్కలను వేసి బాగా ఎర్రగా వేయించాలి.
దానికి తగినంత ఉప్పు, కారం వేయాలి. ఇక తినడానికి రెడీ.
No comments:
Post a Comment