Monday, May 7, 2012

బెండీ పల్లీ ఫ్రై


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బెండకాయలు. ¼ కేజీ
  • పల్లీలు. 50 గ్రా.
  • జీలకర్ర. ½ టీస్పూ//
  • మినప్పప్పు. ½ టీస్పూ//
  • ఆవాలు. ½ టీస్పూ//
  • మిర్చిపొడి. 1 టీస్పూ//
  • పసుపు. ½ టీస్పూ//
  • ఉప్పు. సరిపడా
  • నిమ్మరసం. 1 టీస్పూ//
  • పచ్చి కొబ్బరి తురుము. 1 టీస్పూ//
  • నూనె. తగినంత
  • ధనియాలపొడి. 1 టీస్పూ//
  • కొత్తిమీర తురుము.. కొద్దిగా

తయారీ విధానం

బెండకాయల్ని సన్నటి ముక్కలుగా తరిగి నూనెలో డీప్ ఫ్రై(వేయించి) చేసి ఉంచాలి.
పల్లీలను వేయించి పలుకులుగా పొడి చేసి ఉంచాలి.
ఇప్పుడు ఒక బాణెలిలో కొద్దిగా నూనె వేసి అందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, మిర్చిపొడి, ఉప్పు, పచ్చికొబ్బరి తురుము, పల్లీల పొడి, నిమ్మరసం, వేయించిన బెండకాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలియబెట్టాలి.
అలాగే కాసేపు వేయించిన తరువాత చివర్లో పైన కొత్తిమీర చల్లి దించేసి వేడి వేడిగా వడ్డించాలి.



No comments:

Post a Comment