Monday, May 7, 2012

బెండకాయ ఫ్రై


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బెండకాయలు. 1/4 కేజీ
  • కొబ్బరితురుము. 2 టీస్పూ//.
  • వెల్లుల్లి.. 1/2 పాయ
  • ఉప్పు, కారం.. తగినంత
  • ఎండుమిర్చి. 5
  • కరివేపాకు. 2 రెమ్మలు
  • నూనె. 1/4 కేజీ
  • పసుపు. చిటికెడు
  • జీలకర్ర, ఆవాలు. 1 టీస్పూ//.
  • శనగపప్పు. 1 టీస్పూ//.
  • జీడిపప్పు. 50 గ్రా.

తయారీ విధానం

పాత్రలో నూనె వేడయ్యాక దాంట్లో బెండకాయ ముక్కల్ని వేసి బాగా వేయించి, జల్లెడ గరిటెతో వాటిని మరో పాత్రలోకి తీసి ఉంచుకోవాలి.
వేరే పాత్ర స్టవ్‌మీద పెట్టి కొద్దిగా నూనె వేసి వేడయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, శనగప్పు, జీడిపప్పులను ఒకదాని తరువాత ఒకటి వేస్తూ బాగా వేయించాలి.
తరువాత కొబ్బరితురుము, పసుపు, ఉప్పు, కారాన్ని కూడా దానికి జతచేసి వేయించాలి.
ఈ మిశ్రమం బాగా వేగిందని అనిపించాక. ముందే ఫ్రై చేసి ఉంచిన బెండకాయ ముక్కల్ని వేసి బాగా కలియబెట్టి కాసేపు ఉంచి దించేయాలి.
అంతే బెండకాయ ఫ్రై సిద్ధమైనట్లే.



No comments:

Post a Comment