కావలసిన పదార్థాలు
- ముల్లంగి. 5 దుంపలు
- కారం. 3 టీస్పూ//.
- ఉప్పు. సరిపడా
- నూనె. తాలింపుకు సరిపడా
- ధనియాలపొడి. 1 టీస్పూ//.
- జీలకర్ర పొడి. 1 టీస్పూ//.
తయారీ విధానం
ముందుగా ముల్లంగి దుంపలను పొట్టు తీసి సన్నగా తరుక్కోవాలి.
తర్వాత ముల్లంగి ముక్కల్ని ఉప్పు నీటిలో కడిగి శుభ్రం చేసుకోవాలి.
బాణెలిలో నూనె పోసి నూనె వేడయ్యాక, ముల్లంగి ముక్కలు వేసి తక్కువ మంటలో బాగా వేయించాలి.
తరువాత ఈ ముక్కలకు తగినంత ఉప్పు కలిపి వేయించాలి.
ముక్కలు బాగా ఉడికి మెత్తబడ్డాక నూనె ఎక్కువగా ఉంటే వంపి కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి వేసి కాసేపు వేయించి దించాలి.
అంతే ముల్లంగి వేపుడు రెడీ.
No comments:
Post a Comment