కావలసిన పదార్థాలు
- పాలకూర. 4 కట్టలు
- పెసరపప్పు. 100 గ్రా.
- వెల్లుల్లి. 8 రేకలు
- పచ్చిమిర్చి. 10
- ఉప్పు. సరిపడా
- పసుపు. చిటికెడు
- తాలింపు గింజలు. 1 టీస్పూ//
- ఎండుమిర్చి. 4
- నూనె. 100 గ్రా.
తయారీ విధానం
పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోవాలి.
ఒక బాణెలిలో నూనె పోసి, కాగిన తరువాత తాలింపు
గింజలు, ఎండుమిర్చి, పాలకూర, కడిగి ఉంచుకున్న పెసరపప్పు, వెల్లుల్లి
రెబ్బలు, ఉప్పు, పసుపు వేసి కాసేపు వేయించాలి.
సరిపడేంత నీటిని అందులో పోసి, బాణీ పై మూతపెట్టి తక్కువ మంటలో ఉడికించాలి.
కూర బాగా ఉడికి, పొడి పొడిగా అయిన తరువాత కిందికి దించేయాలి. పాలకూర వేపుడు తయార్.
No comments:
Post a Comment