కావలసిన పదార్థాలు
- పొట్లకాయ. ఒకటి
- పచ్చిమిర్చి. 10
- ఎండుమిర్చి. 2
- పెరుగు. 1 కప్పు
- మినపప్పు. 1 టీస్పూ//
- జీలకర్ర. ½ టీస్పూ//
- ఆవాలు. ½ టీస్పూ//
- పసుపు. ½ టీస్పూ//
- కరివేపాకు. కొద్దిగా
- ఉప్పు. తగినంత
- నూనె. తగినంత
తయారీ విధానం
నూనె వేడి చేసి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించాలి.
రెండు నిమిషాల తరువాత పొట్లకాయ ముక్కలు కూడా వేయాలి.
ముక్కలు మెత్తబడ్డాక దించేసుకోవాలి.
చల్లారాక మిక్సీలో వేసి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ ముద్దకు పెరుగు కలిపి పక్కన పెట్టాలి.
నాలుగు టీస్పూన్ల నూనెను వేడిచేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకులను వేయాలి.
వేగాక గ్రైండ్ చేసిపెట్టుకున్న ముద్దను వేయాలి. ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలిపి పది నిమిషాలపాటు వేయించి దించేయాలి.
No comments:
Post a Comment