కావలసిన పదార్థాలు
- పచ్చి టమోటాలు.. ½ కేజి,
- వేయించిన నలుపు లేదా తెలుపు నువ్వులు.. 200 గ్రా.
- పచ్చిమిర్చి.. 8
- వెల్లుల్లి.. 12 రేకలు
- జీలకర్ర.. 2 టీస్పూ//
- చింతపండు.. 4 రెబ్బలు
- నూనె.. 2 టీస్పూ//
తయారీ విధానం
బాణెలిలో నూనె వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రను వేయించి తీసేయాలి.
మిగిలిన నూనెలో నాలుగు ముక్కలుగా తరిగిన పచ్చి టొమోటో కాయల్ని వేసి మగ్గించాలి.
ముక్కలు బాగా మగ్గిన తర్వాత దించేసి చల్లార్చుకోవాలి.
ఇప్పుడు, మిక్సీలో నువ్వులు, జీలకర్ర,
పచ్చిమిర్చి, వెల్లుల్లి, నానబెట్టి ఉంచుకున్న చింతపండు, టొమోటో ముక్కల్ని
ఒకదాని తర్వాత ఒకటి వేసి ఉప్పు జతచేసి రుబ్బుకోవాలి.
దీనిని వేడి వేడి అన్నంతోనూ, దోసె, ఇడ్లీలలోనూ నంజుకుని తినవచ్చు
No comments:
Post a Comment