కావలసిన పదార్థాలు
- వంకాయలు. 4
- టొమోటోలు 4
- ఉల్లిపాయలు 4
- పచ్చిమిర్చి 2 -10
- కొబ్బరితురుము 1 కప్పు
- చింతపండు నిమ్మకాయంత
- ఉప్పు. తగినంత
- నూనె. 6 టీస్పూ//
పోపు కోసం
- ఎండుమిర్చి 10
- ఆవాలు 1 టీస్పూ//
- జీలకర్ర, 1టీస్పూ//
- శనగపప్పు, 1టీస్పూ//
- మినప్పప్పు 1టీస్పూ//
- ఇంగువ, చిటికెడు
- పసుపు.. చిటికెడు
తయారీ విధానం
ముందుగా పోపు దినుసులన్నింటినీ కాస్తం నూనె వేడి వేయించి ఒక గిన్నెలోకి తీసి పక్కనుంచాలి.
ఆ తరువాత కూరగాయల ముక్కల్ని అదే బాణెలిలో మిగిలిన నూనె వేసి మెత్తబడేంతదాకా వేయించాలి.
ముందుగా పోపు దినుసులను గ్రైండ్ చేసి, ఆ తరువాత కూరగాయ ముక్కల్ని కూడా వేసి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసి ఉప్పు సరిచూసుకోవాలి.
ఇది అన్నంలోకి, దోశెల్లోకి చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment