కావలసిన పదార్థాలు
- యాపిల్ రసం – 1/2 లీటరు
- చక్కెర – 1/2 కేజీ
- రంగు . మీకు నచ్చినది మరియు ఎసెన్స్
- సిట్రిక్ యాసిడ్ - కొద్దిగా
తయారీ విధానం
యాపిల్ ముక్కలు కోసి గింజలు తీసేసుకోవాలి.
పాత్రలో ముక్కల్ని వేసుకొని, అవి పూర్తిగా మునిగేటట్లు నీళ్ళు వేయాలి.
15ని. సన్నటి సెగ మీద ఉడకనివ్వాలి.
రసం వేరు పడేటప్పుడు సిట్రిక్ యాసిడ్ కలపాలి.
రసం వేరుపడిన తర్వాత దించి ఈ మిశ్రమాన్ని ఒక పల్చని గుడ్డలో పోసి వడకట్టుకోవాలి.
వడకట్టుకొన్న రసాన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని చక్కెర చేర్చి పాకం పట్టాలి.
బాగా ముదురు పాకం వచ్చాక, చల్లారనిచ్చి ఎసెన్స్ కలపాలి.
శుభ్రపరచుకొన్న సీసాలోనే జెల్లీని నింపుకోవాలి.
No comments:
Post a Comment